సంతోషంగా సాగుతున్న కుటుంబాల్లో అనుమానపు బీజాలు నాటుకుని నిండు జీవితాలను నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానం పెరిగి పెరిగి అది కుటుంబాలను చిదిమేసే స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే భార్యలను హత్య చేయటం లేదా భార్యలే ఆత్మహత్య చేసుకోవటం వంటవి జరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
అర్బన్‌కాలనీలో లక్ష్మి, వెంకటాచారికి 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఇక కొన్నాళ్ల పాటు వీరి అనోన్య జీవితం సాఫిగానే సాగింది. కొంత కాలం తర్వాత భార్య లక్ష్మిపై భర్తకు అనుమానపు బీజాలు నాటుకున్నాయి. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందేమోనని అనుకున్నాడు. ఇదే అనుమానం వెంకటాచారికి రోజు రోజుకు బలపడింది. దీంతో ప్రతి రోజు భార్యపై పరుష పదాలతో దూషించటం, రోజు హింసించటం చేస్తూ ఉండేవాడు.
దీంతో భరించలేని భార్య లక్ష్మి కొన్నాళ్ల పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కొంత కాలం గడిచిన తర్వాత లక్ష్మి మళ్లీ భర్తకు వద్దకు చేరుకుంది. దీంతో భర్త వెంకటచారికి మాత్రం భార్యపై ఉన్న ఆ అనుమానం చెక్కుచెదరలేదు. ఇదే విషయమై ఒక రోజు రాత్రి భార్యాభర్తలిద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో అగ్రహించని భర్త వెంకటాచారికి కోపం దూసుకొచ్చింది. దీంతో ఎలాగైన భార్య లక్ష్మిని కడతేర్చాలనుకున్నాడు. దీంతో నిద్రిస్తున్న భార్యను ఏకంగా అదే రాత్రి గొంతునులిమి హత్య చేశాడు. ఇక వెంకటాచారి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పాటు లొంగిపోయాడు.
దీంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా సంచనలంగా మారింది. ఇక వెంకటాచారి లాంటి భర్తలు ఎంతో మంది అనుమానం ఉన్నారు. ఇక ఇలాంటి వాళ్లకు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.