ప్రేమంటే అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ యువకుడు తనతో పాటు రానందన్న కారణంతో తన ప్రియురాలిని చంపటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, చిక్కబల్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన మంజునాథ అనే యువకుడు టిక్‌టాక్‌లో రీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతడికి హొసకోటెకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సోషల్ మీడియా ద్వారా ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. కొన్ని రోజుల క్రితం అతడు ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. తనతో పాటు సరదాగా బయట తిరగటానికి రమ్మని ఆమెను పిలిచాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో మంజునాథ్‌కు కోపం వచ్చింది.
పట్టలేని ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు భాగంలో పొడిచాడు. కత్తి దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం మంజునాథ్ తనను తాను కత్తితో పీక కోసుకున్నాడు. ఇద్దరూ రక్తపు మడుగుల్లో పడిపోయారు. యువతి అరుపులు విన్న చుట్టు పక్కలి వారు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగుల్లో పడిఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆరోగ్యం బాగైన తర్వాత అతడ్ని అరెస్ట్ చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు. మరి, ప్రియురాలి ఇంటికెళ్లి మరీ ఆమెను చంపటానికి ప్రయత్నించిన మంజునాథ్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.