భవిష్యత్తు గురించి ఎన్నో కలలతో.. వర్తమానం ఎలా ఉంటుందోనన్న భయంతో అత్తారింట్లో అడుగుపెడుతుంది కొత్త కోడలు. ఇలాంటి వేళ అత్తింటి వారు తనను సొంత బిడ్డలా అక్కున చేర్చుకోకపోయినా.. కనీసం మనిషిలా చూస్తే చాలు. కానీ కన్న బిడ్డలా చూసుకోవాల్సిన మామే.. కోడలిపై కన్నేస్తే.. విషయం తెలిసిన భర్త, అత్త కాపాడాల్సింది పోయి.. సర్దుకుపొమ్మంటే.. ఇక ఆ మహిళ జీవితం ఎంత నరకప్రయాంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆ అభాగ్యురాలు.. ఆ మృగాళ్ల చేతిలో బలయ్యింది. ఈ కోవకు చెందిన దారుణం తాజాగా వెలుగు చూసింది. సొంత బిడ్డలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేశాడు ఓ మామ. పైకి మంచివాడిలా నటిస్తూ.. కోడలిని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో.. దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
హర్యానా… పల్వాల్ జిల్లాలోని అలీగఢ్ రోడ్డులోని కిత్వాడి కాలనీకి చెందిన రజనీ అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. ప్రారంభంలో అంతా బాగానే ఉంది. రజనీని బాగానే చూసుకున్నారు అత్తామామలు. ఈ క్రమంలో వృద్ధుడైన మామ.. ప్రతి రోజు తన కాళ్లు పట్టాల్సిందిగా రజనీని కోరేవాడు. మామను తండ్రిలా భావించిన రజనీ.. అతడికి సపర్యలు చేసేది.
ఇదే అదునుగా భావించిన రజనీ మామ.. కాళ్లు నొప్పులుగా ఉన్నాయ్.. ఒత్తమని చెప్పి ఆ సాకుతో అసభ్యకర పనులు చేసేవాడు. ఆ కోడలు ఎంత వద్దని వారించినా వినేవాడు కాదు ఆ దుర్మార్గుడు. తన కామ వాంఛ తీర్చమని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం విని అవాక్కయిన బాధితురాలు.. అత్తను తల్లిలా భావించి జరిగిన సంగతి చెప్పింది. కోడలిని కూతురులా భావించి మంచీ చెడు చూసుకోవాల్సిన అత్త సైతం.. ఆ దుర్మార్గుడికే వంత పాడింది.
తాను ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి కట్టుకున్న భర్తకు తెలియజేసింది రజనీ. అతగాడు తక్కువేమీ తినలేదు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుంది.. నోరు మూసుకుని కూర్చొమనేవాడు. కట్టుకున్న భర్త కూడా ఇలానే మాట్లాడటంతో.. ఎంతో బాధపడింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. ఇక కొడుకు, భార్యకు తెలిసినా.. తనను ఏమి అనకపోవడంత.. రజనీ మామ మరింత రెచ్చిపోయాడు.
ఏలాగైనా కోడలిని లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలని భావించిన అతడికి నిరాశ ఎదురయ్యే సరికి.. శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. అయినా.. లొంగపోయేసరికి మార్చి 4 న భర్త, అత్త, మామలు ఆమెను కాల్చి చంపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై చాంధత్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.