వాళ్లిద్దరూ భార్యాభర్తలు. చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. అప్పటి వరకు వీరి సంసారం సంతోషంగా సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. గర్భిణీ అని కూడా చూడకుండా భర్త భార్యను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య 4 నెలల గర్భిణీ అని కూడా చూడకుండా నడి రోడ్డుపై హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ హత్య ఘటన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. భార్య 4 నెలల గర్భిణీ అని కూడా తెలిసి భర్త ఎందకు చంపాడు? ఇంతకు ఆమె చేసిన పొరపాటు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా హిసార్ లోని అగ్రోహ బ్లాక్ ప్రాంతం. ఇక్కడే రోషన్ లాల్-రాజ్ బాలా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2013లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. దీంతో ఈ భార్యాభర్తల కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే రోషన్ లాల్ భార్య రాజ్ బాలా స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. భర్త కళ్లు గప్పి ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా కొన్నేళ్ల పాటు భార్య తన చీకటి కాపురాన్ని నడిపించింది. ఇదిలా ఉంటే.. భార్య సాగిస్తున్న రంకుపురాణం భర్తకు తెలిసింది. ఇక నుంచైనా బుద్దిగా ఉండాలంటూ భర్త వార్నింగ్ ఇచ్చాడు.
అయినా తన తీరు మార్చుకోని భార్య.. ప్రియుడితో అనేక సార్లు శారీరకంగా కలుస్తూ ఉండేది. ఇలా కాదని భావించిన భర్త రోషన్ లాల్ పెద్ద మనుషులతో పంచాయితి పెట్టించాడు. పెద్దలందరూ ఇద్దరికీ సర్ది చెప్పి బుద్దిగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇలా కొన్నాళ్ల పాటు అతని భార్య సైలెంట్ గానే ఉంది. అలా కొన్ని రోజులు గడిచిందో లేదో.. ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి 10 నెలల కిందట లేచిపోయింది. దూరంగా ఉంటూ ప్రియుడితోనే కాపురం పెట్టింది. అయితే భార్య చేసిన పనికి పరువు పోయిందని భర్త తరుచు బాధపడేవాడు. కొన్ని రోజుల తర్వాత భార్య గర్భం దాల్చిందని తెలుసుకున్నాడు. ఇక అతని కోపం మరింత ఎక్కువైంది. ఎలాగైన సరే భార్య రాజ్ బాలాను చంపాలని అనుకున్నాడు. బుధవారం ఆమె ఆస్పత్రి నిమిత్తం బయటకు వచ్చింది.
ఇదే మంచి సమయం అనుకున్నా భర్త భార్య 4 నెలల గర్బిణీ అని కూడా చూడకుండా ఆస్పత్రి ముందే అతి కిరాతకంగా నరికాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి మరి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో నిందితుడు.. నా భార్య పరాయి మగాడితో లేచిపోయి గర్భవతి అయిందని, అందుకే ఆమెను హత్య చేశానంటూ తెలిపాడు. అతడి మాటలను పోలీసులు సైతం షాక్ గురయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.