పండగకమందు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి ఆరుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చిన్న తప్పిదం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు క్షణాల్లో అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అది ఉదయం 8 గంటల సమయం. ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు ఎవరి పనుల్లో వారు బిజిగా ఉన్నారు.
ఇక కిచెన్ లో ఇద్దరు వ్యక్తులు వంట చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వంటింట్లో ఉన్న సిలిండర్ నుంచి హఠాత్తుగా గ్యాస్ లీక్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు అలెర్ట్ తలుపులు తీసే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంటి తులుపులు తెరుచుకోలేదు. దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇళ్లంత మంటలతో నిండిపోయింది. అడుగు కూడా బయట వేసే పరిస్థితి లేకపోవడంతో కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు ఆ మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు.
ఈ ఘటన హర్యానా పానిపట్ జిల్లాలోని తహసీల్ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. దీనిపై వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆ మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కానీ వారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. మృతుల్లో అఫాన్ (7),అఫ్రోజా (46), ఇష్రత్ ఖటుమ్ (17), అబ్దుల్ షకూర్ (10), అబ్దుల్ కరీమ్ (50)గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.