17 ఏళ్ల బాలికపై ఓ తండ్రి, సోదరుడు కలిసి దారుణానికి పాల్పడ్డారు. గత కొంత కాలం నుంచి బలవంతంగా ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.
రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు మానవ మృగాలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఐలవ్ యూ అని చెప్పడం, కాదంటే హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమ్మాయిలకు బయటే కాదు, ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. అవును మీరు విన్నది నిజమే. కనిపెంచిన తండ్రి, సోదరుడు.. ఇంట్లో బాలికపై అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా హర్యానాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ కొడుకు, 17 ఏళ్ల కూతురు ఉంది. అయితే దుర్మార్గంగా ఆలోచించిన ఓ తండ్రి.. తన కన్న కూతురిపై కన్నేశాడు. ఇటీవల తండ్రితో పాటు కొడుకు కలిసి ఇద్దరూ ఆ మైనర్ బాలికపై గత కొన్ని రోజుల నుంచి లైంగిక దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దారుణమైన విషయాన్ని ఆ బాలిక ఇటీవల స్కూల్ లో టీచర్ కు వివరించింది. ఆ బాలిక మాటలు విన్న ఆ టీచర్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
వెంటనే టీచర్ ఆ తండ్రి, కొడుకు దారుణంపై సహించలేకపోయింది. దీంతో వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. అయితే కన్న తండ్రి, సోదరుడే ఆ బాలికపై ఇలాంటి పాడు పనులకు కాలుదువ్వడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.