మాయలు, మంత్రాలు తెలుసని నమ్మించాడు.. తన వద్దకు వచ్చిన మహిళల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని.. వారిపై దారుణాలకు తెగబడ్డాడు. పైకి పవిత్రమైన కాషాయం కట్టి.. కామపిశాచి కంటే దారుణంగా తయారయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 120 మంది అమాయక మహిళలపై అత్యాచారం జరిపాడో దుర్మార్గుడు. ‘జిలేబీ బాబా’గా పేరుపొందిన ఆ నీచుడు.. ప్రస్తుతం దోషిగా తేలి జైల్లో చిప్పకూడు తింటున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్ అమర్‌వీర్. అతనిది పంజాబ్‌లోని మాన్సా ప్రాంతం. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం పెట్టుకున్నాడు. కొంతకాలానికి అతని భార్య కన్నుమూయడంతో.. అక్కడి నుంచి ఏటో వెళ్లిపోయి.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఆ ఊరు చేరుకున్నాడు. వచ్చిన తర్వాత.. తనకు తాంత్రిక విద్య తెలసని.. వాళ్లకి వీళ్లకి చెప్పుకుంటూ.. జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. తన వద్దకు వచ్చే అమాయక మహిళలను నమ్మించి.. ధనం, లాభం కోసం పూజలు చేస్తానని మాయమాటలతో వంచించాడు.
తాంత్రిక పూజలు చేసే సమయంలో ఆత్మలు ఆవహిస్తాయని.. ఆ టైమ్‌లో మీకు ఏం జరుగుతుందో మీకు అసలు అర్థం కాదని.. ఏం జరిగినా భరించాలంటూ వారిని తన దారుణలకు మానసికంగా సిద్ధం చేసేవాడు. పూజలంటూ ఏవో మత్తు పదార్థాలు ఇచ్చి.. వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పూజల పేరుతో కామ వాంఛ తీర్చుకోవడమే కాకుండా.. పైశాచికత్వంతో తన కామకేళిని తానే వీడియో తీసుకుంటూ.. ఆ వీడియోలను సదరు మహిళలకు పంపి.. డబ్బు కోసం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే వాడు. ఈ బాబా అకృత్యాలు మరింత పెరగడంతో అతని పాపం పండింది. ఈ దొంగ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతే.. ఇదే అదునుగా అతని అకృత్యాలకు బలైన కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఈ దొంగబాబా ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు.. వాటికి సంబంధించిన వీడియోలు అతని ఆశ్రమంలో లభించాయి. వీడియోలతో పాటు మహిళలకు ఇచ్చే మత్తు పదార్థాలు సైతం అక్కడ దొరికాయి. ఇక దొంగబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి.. హరియాణా కోర్టు ఎదుట హాజరు పర్చగా.. కోర్టు ఆ జిలేబీ బాబాను దోషిగా తేల్చింది. మరి దొంగబాబా అకృత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 #Haryana’s ‘Jalebi Baba’ convicted under rape charges, sentence to be pronounced today pic.twitter.com/eG69SaTE6N
— MegaNews Updates (@MegaNewsUpdates) January 9, 2023