నేటి కాలం యువతి యువకులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. రకరకాల కారణాలు చూపిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ డిగ్రీ స్టూడెంట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
ఈ రోజుల్లో తెలిసి తెలియని వయసులో కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువులో ఫెయిల్ అయ్యానని, తల్లిదండ్రులు మందలించారనే కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఆ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో సంపత్-సుమలత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి కార్తీక్ (21), వినయ్ అనే కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు కార్తిక్ స్థానికంగా డిగ్రీ చదువుతుండేవాడు. ఇతనికి రాకేష్, అఖిల్ అనే స్నేహితులు ఉండేవారు. వీరు ముగ్గురు ప్రాణ స్నేహితులు. అయితే రాకేష్ రెండేళ్ల క్రితం మరణించగా, అఖిల్ 6 ఏళ్ల కిందట క్యాన్సర్ కు గురై ప్రాణాలు విడిచాడు. ప్రాణ స్నేహతులు చనిపోవడంతో కార్తిక్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఇక వారి మరణాన్ని తలుచుకుంటూ తరుచు బాధపడేవాడు. దీంతో కార్తిక్ అప్పుడప్పుడు.. నేను కూడా నా స్నేహితుల వద్దకు వెళ్తానని తల్లిదండ్రులతో చెప్పేవాడట. ఇదిలా ఉంటే సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో.. నా మరణానికి నేనే కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి కార్తిక్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సీన్ చూసిన అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులు చనిపోవడంతోనే తట్టుకోలేక కార్తిక్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.