కారుతో వేగంగా బైక్‌ను ఢీకొట్టడం.. అటు మీదట ఆపకుండా వెళ్లిపోవడం.. ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన అంజలి అనే యువతి కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఈ విషాదంతం మరవక ముందే అదే తరహా ఘటన గురుగ్రామ్ లో మరొకటి వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా ఢీకొన్న కారు, వారిని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి.
రిథోజ్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బుధవారం సాయంత్రం బైక్‌పై తాము పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంటికి బయలుదేరారు. వీరు గురుగ్రామ్ లోని సెక్టార్ 62 నుంచి గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్దకు రాగానే వెనుకనుంచి వచ్చిన ఓ కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు కింద పడిపోయారు. అయితే, ప్రమాద సమయంలో బైక్.. కారు కింద వైపున ఇరుక్కుపోయింది. ఈ విషయం తెలిసినా.. డ్రైవర్ కారు ఆపకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలను కారు వెనుక ప్రయాణిస్తున్న వరకు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై.. యువకులు పోలీసులకు పిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా నిందితుడిని ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
Hit & drag accident: A speeding car hit a stationary motorcycle in Haryana’s Gurugram and dragged the two-wheeler for around 3-4 Km.
The bike-borne man, a bouncer by profession, narrowly escaped the accident with minor bruises.@NewIndianXpress pic.twitter.com/V6wPaX0BD4
— Ujwal Jalali (@ujwaljalali) February 3, 2023