గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెల్లడయ్యింది. ఈ కేసులో ఫాస్ట్రాక్ కోర్టు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణ సుమారు 9 నెలల పాటు కొనసాగింది. చివరకు ఏప్రిల్ 29న ఫాస్ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కేసుకు సంబంధించి 36 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం రికార్డు చేసింది.. చివరకు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
బీటెక్ చదువుతున్న రమ్య తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఆగస్టు 15, 2021 ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. శుక్రవారం కోర్టు.. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.