ఇతని పేరు జయసూర్య. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువకుడు జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకున్నాడు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేశాడు. అలా కొంత కాలం తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న క్రమంలోనే ఈ యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించాడు. ఆమే సర్వం అనుకున్నాడు. కానీ తర్వాత జరిగింది తట్టుకోలేక ఆ యువకుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
హైదరాబాద్ పరిధిలోని గాజులరామారంలో జయసూర్య (25) అనే యువకుడు తల్లిదండ్రులతో పాట నివాసం ఉంటున్నాడు. కొంత వరకు చదువుకున్న ఆ యువకుడు ఆ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరాడు. అలా తనంతట తాను పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఇదిలా ఉంటే జయసూర్య స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ యువతి కూడా మనోడిని ఇష్టపడింది. అలా మూడేళ్ల పాటు వీరిద్దరి ప్రేమాయణం కొనసాగుతూ వచ్చింది.
అయితే ఈ క్రమంలోనే ఇటీవల తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో జయసూర్య అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఏదో ధ్యాసలో ఉండడం, మద్యానికి బానిసవ్వడం, ఆఫీసుకు వెళ్లకపోవడం వంటి కారణాలతో పూర్తిగా చెడిపోయాడు. అయితే జయసూర్య మంగళవారం కవాడిగూడలో ఉన్న తన సొంతటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక జయసూర్య తన ప్రియురాలిని మళ్లీ గుర్తుకు చేసుకున్నాడు. ఆ సమయంలో ఇలాంటి బతుకు నాకొద్దు అనుకున్నాడో ఏమో కానీ… ఆ యువకుడు తలుపులు పెట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇక రాత్రి అయినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రలు ఖంగారుపడ్డారు. కవాడిగూడలో ఉన్న తమ పాత ఇంటికి వచ్చి చూడగా… కుమారుడు జయసూర్య ఇంట్లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ ను చూసిన ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలసులు విచారణ చేపడుతన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.