దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో చివరికి నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైల్వే ట్రాక్ పై రాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఈ దుర్మార్గుడి ఆత్మహత్యపై మాత్రం కొందరు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా బాధిత కుటంభికులు ఆత్మహత్య చేసుకున్నది రాజు కాకపోవచ్చని, టాటూ గుర్తుతో ఎంతమంది రాజులు లేరని చిన్నారి తల్లిదండ్రులు ప్రశ్నించారు.
ఇలా నిందితుడు రాజు మరణంపై ఎంతో మంది ఎన్నో రకాలుగా తమ వాదనను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ మహేందర్ మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనవసరమైన రాద్దాంతం చేయకూడదని, ఆత్మహత్య చేసుకున్నది రాజేనని ఆయన అన్నారు. దీనికి సాక్షలుగా రైల్వే ట్రాక్ మెన్లు, ఇద్దరు ట్రైన్ డ్రైవర్లు, ముగ్గురు రైతులు ఉన్నారని ఆయన తెలిపారు.
ఇది కాకుండా మీ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. దీంతో పాటు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని వీడియో రికార్డు చేసి భద్రపరిచామని ఆయన తెలిపారు. ఇక తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చేసిన ఈ విధమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.