పట్టపగలు నడిరోడ్డుపై అచ్చం సినిమాను తలపించేలా ఉన్న ఈ సీన్ తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంది. పిల్లల ముందే ఓ దుర్మార్గుడు తల్లిని కత్తితో హత్య చేసిన ఘటన ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సౌత్ వెస్ట్ ఢిల్లీలో 24 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఎప్పటి నుంచో ఓ యువకుడు ఆమెను వెంబడిస్తున్నట్లు ఆ మహిళ తెలుసుకుంది. దీంతో తొందర తొందరగా పరిగెత్తే ప్రయత్నం చేసింది.
ఇది కూడా చదవండి: కత్తితో కడుపులో పొడుచుకున్న 6 నెలల గర్భవతి!
అయినా వదలని ఆ యువకుడి అందరూ చూస్తుండగా కత్తితో ఆ మహిళను పిల్లల ముందే దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విషయం ఏంటంటే? ఆ దుండగుడికి ఆ మహిళతో గతంలోనే పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియాజేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.