ఇటీవల సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను వాడుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇంటర్నెట్ను ఓ రేంజ్లో ఉపయోగించుకుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాను, సినిమా పోస్టర్‌ను సైతం సైబరాబాద్ పోలీసులు వాడుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు.
‘ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా. మాస్కు పెట్టుకో సిన్నప్పా. ఇంకా కరోనా పోలేదు సిన్నప్ప’ అంటూ ఓ మీమ్‌ను తయారుచేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. సైబరాబాద్ పోలీసులు ఎంతో సున్నితంగా మాస్కు పెట్టుకోవాలన్న విషయాన్ని చేరవేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ట్రెండ్‌ను ఫాలో అవుతూ ప్రజలకు తమదైన స్టైల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తుంటారు. సైబర్ మోసాలు, హైటెక్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోయినా సామాజిక దూరం పాటించకపోయినా ఎదురయ్యే సమస్యల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.
సోషల్ మీడియాలో మీమ్స్ హడావుడి అంతా ఇంతా కాదు. పది వాక్యాల్లో చెప్పే విషయాన్ని చిన్న మీమ్ ద్వారా చెప్పొచ్చు. రాజకీయ నాయకులు, ప్రముఖులు, సైబరాబాద్ పోలీసులు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల అమేజాన్ ప్రైమ్‌లో నారప్ప సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంతో మీమ్ క్రియేట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్, తారక్ హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తుంటారు. ఈ పిక్‌ను కూడా సైబరాబాద్ పోలీసులు వాడుకున్నారు. వాళ్లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని మీరూ అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే యమపురికి పోతారంటూ హెచ్చరించారు.
సమయానికి తగినట్టుగా, నేటి ట్రెండును ఫాలో అవుతూ చమత్కారం జోడించి ట్వీట్స్ చేయడం సైబరాబాద్ పోలీసులకు ఇదేం కొత్త కాదు. కరోనా టైమ్ లో వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా జనాలను ఎప్పుడూ అలర్ట్ చేస్తూంటారు.
సినిమాలన్నా, స్టార్లన్నా తెలుగు ప్రజలకు అభిమానం ఎక్కువ. కాబట్టి ప్రముఖ సినిమాలు, అందులోని స్టార్ల డైలాగులను ఎడిట్ చేసి ప్రజలను సందేశాలు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Don’t forget your mask. COVID-19 is still awake. #Narappa
Always #WearAMask when stepping out. #StaySafe #covid19 #MaskUpIndia pic.twitter.com/S3eEoquPCn
— Cyberabad Police (@cyberabadpolice) July 22, 2021