నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుని మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. అలా అనేక మంది తమ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా నిరూపించుకుని అతి తక్కువకాలంలోనే సెలబ్రిటీలు అవుతున్నారు. అయితే ఇలా వచ్చిన ఫేమ్ తో చాలా మంది అనేక అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి వెళ్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తమకు వచ్చిన క్రేజ్ తో మోసాలకు పాల్పడుతున్నారు. తమను నమ్మిన అభిమానులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ స్టార్ తన అభిమానులను నట్టేటా ముంచింది. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.437 కోట్ల మేర వారికి కుచ్చుటోపి పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
థాయ్ లాండ్ కు చెందిన నత్తమోన్ ఖోంగో చక్ అనే యువతి డ్యాన్స్ వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టేది. అలా తన డ్యాన్స్ వీడియోలు పోస్టు చేయడం ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాందించుకుంది. ఫ్యాన్స్ ఆమెని ముద్దుగా ‘నట్టి’ అని పిలుచుకునే వారు. ప్రస్తుతం ఆమెకు 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్ గా ఎదిగింది. అంతేగాక తన సోషల్ మీడియాలో ఔత్సాహిక ఫారెక్స్ బిజినెస్ మ్యాన్ ల కోసం ఓ ప్రైవేటు కోర్సులకు ప్రచారం కూడా చేసింది. అలా ప్రచారం చేస్తూనే.. తనకు వచ్చే లాభాలకు సంబంధించిన వివరాలను సైతం ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అంతటి తో ఆగక తన అభిమానులకు ఆశ పుట్టించింది. విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35% అధికంగా లాభాలు వస్తాయని అభిమానులను నమ్మించింది. ఇక తమ అభిమాన నటి మాటలను వేదవాకులుగా భావించి ఆమె ఫాలోవర్స్ దాదాపు 6000 మందికి విదేశీ మారకంలో పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం నట్టి వ్యాపారం బాగానే సాగింది. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లో మే నెలలో ఇన్వెస్టర్లకు తాను 27.5 మిలియన్ డాలర్లు బకాయిపడ్డానని చెప్పింది.
అంతేగాక తనకు స్టాక్ మార్కెట్ లో బ్రోకర్ గా వ్యవహరించిన వ్యక్తి.. గత మార్చి నుంచి తన వ్యాపార ఖాతాలను బ్లాక్ చేసినట్లు వెల్లడిచింది. అభిమానులను, ఫాలోవర్స్ ను మోసం చేయడం తన ఉద్దేశ్యం కాదని త్వరలోేనే ఎవరి డబ్బులు వారికి చెల్లిస్తానని తెలిపింది. అయితే బాధితుల వర్షన్ వేరేలా ఉంది. అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి మోసం చేసిందని థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.