అంగన్‌వాడీ టీచర్ పనితీరు సరిగాలేదని, రాజీనామా చేయాలని స్థానికులు, గ్రామ సర్పంచ్ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. అది కాస్తా పెగిరి అంగన్‌వాడీ టీచర్‌పై దాడి చేస్తే స్థాయికి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్‌తండా గ్రామపరిధిలోని తేజావత్‌తండాలో చోటుచేసుకుంది. గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్ కమల. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో కొంతకాలంగా టీచర్‌కు, స్థానికులకు మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి.
అవికాస్త పెరిగి సోమవారం రాత్రి ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల గాయపడింది. పుస్తెలతాడు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితురాలు వాపోయింది. దుస్తులు చింపేసి దాడికి పాల్పడ్డారు. స్థానిక సర్పంచ్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని.. అందుకు అంగీకరించకపోవడంతో దాడి చేశారని ఆరోపించింది. దాడి అనంతరం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాణా ప్రతాప్ తెలిపారు.