ప్రతి ఏటా సూర్యుడు తన ప్రతాపం పెంచుకుంటూ పొతున్నాడే కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. అలానే ఈ ఏడాది కూడా భానుడు భగభగ మంటున్నాడు. పిల్లలు, వృద్ధులు ఈ సూర్యతాపానికి అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మిరప, పత్తి తదితర పంటల్లో పనులు చేసే వారు ఆరుబయటే ఉండాలి. వారి సమస్యను పరిష్కరించేందుకు షణ్ముగ రావు అనే వ్యక్తి ఓ నూతన ఆవిష్కరణ చేశారు.
ప్రతి ఏటా సూర్యుడు తన ప్రతాపం పెంచుకుంటూ పొతున్నాడే కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. అలానే ఈ ఏడాది కూడా భానుడు భగభగ మంటున్నాడు. పిల్లలు, వృద్ధులు ఈ సూర్యతాపానికి అల్లాడిపోతున్నారు. ఇక ఎండలు మండుతున్నా పల్లెటూరులోని ప్రజలు పొలం పనులకు వెళ్లక తప్పదు. ముఖ్యంగా మిరప, పత్తి తదితర పంటల్లో పనులు చేసే వారు ఆరుబయటే ఉండాలి. వారికి ఈ ఎండే ప్రధాన సమస్యగా ఉంటుంది. అయితే ఇలాంటి వారికి కోసం మహబాబుబాద్ జిల్లాకు చెందిన రేపల్లె షణ్ముగ రావు ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. ఆ నూతన ఆవిష్కరణ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మిరప, పత్తి వంటి ఇతర పంటల్లో పనులు ఎండల్లో ఉండే చేయాలి. అయితే ఇలా ఎండలో కూలీలు పడుతున్న కష్టాలను చూసి మహబూబాబాద్ జిల్లా కంబాల పల్లికి చెందిన రేపల్లె షణ్ముగ రావు ‘సామూహిక గొడుగు’ను ఆవిష్కరించారు. పొలంలో పక్కపక్కన సాళ్లలో పది మంది పనులు చేసుకోవడానికి సరిపోయేంతగా ఈ గొడుగు ఉంటుంది. నీడనిచ్చే ఈ సామూహిక గొడుగు చక్రాలతో కూడి.. 20 అడుగుల వెడల్పున, 6 అడుగుల మేరకు నీడనిస్తుంది. అలానే ఈ గొడుకు 7 అడుగుల ఎత్తు ఉంటుంది. అలానే సాళ్లలో పనులు చేసే వారు ముందుకు వెళ్లే కొద్ది .. అవసరం మేరకు జరుపుకోవడానికి 4 చక్రాలను అమర్చారు.
ఇక ఈ భారీ గొడుగు ఖరీదు విషయానికి వస్తే.. చాలా తక్కువ ధరలో ఉంటుంది. ఇనుప పైపులతో చేసే ఈ గొడుగు ఖరీదు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటుంది. అలానే దీని బరువు 15 నుంచి 18 కిలోలు మాత్రమే ఉంటుంది. పని పూర్తైన తరువాత ఈ గొడుగును విడిగా చేసి భద్రపర్చుకోవచ్చు. విడి భాగాలను పది నిమిషాల్లో ఒకచోట చేర్చి గొడుగును నిలబెట్టుకోవచ్చు. ఈ భారీ గొడుగు తయారీ విషయానికి సంబంధించి షణ్ముగ రావు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. “30 ఏళ్లుగా మోటారు మోకానిక్ గా ఉంటూ రైతులు, కూలీలు ముఖ్యంగా మహిళలు పడుతున్న బాధలను దగ్గరి నుంచి చూస్తున్నాను. ఉష్ణోగ్రత పెరుగుతున్నందు వల్ల వారు తట్టుకోలేక పోతున్నారు” ఆయన తెలిపారు. వారి బాధను కొంతైనా తగ్గించాలని ఈ ఆవిష్కరణ చేశానని షణ్ముగ రావు తెలిపారు. దీనిని గ్రామాల్లో, పట్టణాల్లో ఎవరైన తయారు చేసుకోవచ్చని షణ్ముగరావు అన్నారు.