పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు పూజిత. వయసు 19 ఏళ్లు. తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదువుకుంటూ ఉంది. అయితే కూతురుని గొప్ప ప్రయోజకురాలిని చేయాలని తల్లిదండ్రులు ఎన్నో కలల కన్నారు. ఇందు కోసం తల్లిదండ్రులు కూతురుని మంచి విద్యా సంస్థలో చదివించారు. ఇక కూతురు కూడా బాగానే చదువుకుంటూ తల్లిదండ్రుల వద్ద నమ్మకంగా మెలుగుతూ వస్తుంది. ఇదిలా ఉంటే పూజిత ఎప్పటిలాగే బుధవారం తిని తల్లిదండ్రుల వద్దే పడుకుంది. తల్లిదండ్రులు కూడా నిద్రలోకి జారుకున్నారు. కట్ చేస్తే.. అర్థరాత్రి 2 గం.లకు తల్లికి మెలుకువ రాగానే పక్కకు చూడగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కూతురు ఇలా చేయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
చిత్తూరు జిల్లాలోని తేనబండ. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో బుజ్జి అనే మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి పూజిత (19) కూతురు జన్మించింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇక కూతురు జీవితంలో గొప్పగా స్థిరపడేందుకు తల్లిదండ్రులు బాగా చదివించారు. ఇదిలా ఉంటే బుధవారం పూజిత తల్లిదండ్రులతో పాటు తిని పడుకుంది. ఇక అర్థరాత్రి సమయం 2 గం.లు దాటింది. దీంతో తల్లి బుజ్జికి మెలుకువ వచ్చింది. పక్కకు చూడగా.., కూతురు పూజిత కనిపించలేదు. దీంతో తల్లి ఖంగారుపడి అటు ఇటు వెతికింది. కానీ ఎంత వెతికినా కూతురు జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక పూజిత తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.