పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు గీత. వయసు 36 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె.. జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకుంది. అయితే చిన్నప్పటి నుంచి గీతకు చదువంటే మహా ఇష్టం. ఎప్పటికైనా టీచర్ కావాలనేదే ఆమె కోరిక. దీని కోసం ఎంతో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసింది. అలా కొన్నాళ్ల తర్వాత గీత తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని చివరికి ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ వరకు ఎదిగింది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న క్రమంలోనే ఊహించని పరిణామంతో ఆమె జీవితం.. అంతటితో ముగింపు పలికింది. అసలు గీత ఎవరు? ఆమెకు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలసుకుందాం.
గీతకు బాబు రావు అనే వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇకపోతే గీత హుజూర్ నగర్ పట్టణంలోనే మహాత్మా గాంధీ జ్యోతి రావుపూలే గురుకుల బాలికల పాఠశాలలో ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అనుక్షణం విద్యార్థుల కొరకు పరితపించే గీత కుటుంబాన్ని వదిలి మరీ పిల్లల కోసం ఆలోచించేంది. ఇదిలా ఉంటే గీత బుధవారం పాఠశాలలో స్టడీ అవర్ ఉండడంతో రాత్రి 9 వరకు స్కూల్ లోనే ఉన్నారు. ఇక స్టడీ అవర్ ముగిసాక తన తోటి ఉపాధ్యాయులతో కలిసి ఆటోలో కోదాడకు వెళ్లాలనుకుంది.
ఇందు కోసం గీత ఆటో ఎక్కారు. ఇక ఆటో చిలుకూరు సమీంపలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ గీత ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడగా.., గీత మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానికులు గమనించిన గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. గీత చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.