ప్రేమించిన అమ్మాయిని ఎవడైన కన్నేత్తి చూసినా, పన్నెత్తి మాట్లాడే ప్రయత్నం చేసినా.. వాడిని మాత్రం వదలరు. ఎలాగైన వాడి మీద పగను తీర్చుకుంటారు. ఇక అలాంటిది.. ఏకంగా ఎవడైనా వేధించాడని తెలిస్తే ఊరుకుంటారా.. అస్సలు, దగ్గదేలే అంటూ వాడి అంతు చూసే దాక వదిలిపెట్టారు. అచ్చం ఇలాగే దారుణం చేశాడో ప్రియుడు. ప్రిన్సిపాల్ తన ప్రియురాలిని వేధించాడనే కారణంతో ఆ యువకుడు ప్రిన్సిపాల్ ను దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా ఛత్తీస్ గడ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ లో ఉపేంద్ర కౌశిక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా చదువుకునే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి కూడా అతడిని ప్రేమిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రోజూ కాలేజీకి వెళ్లి వస్తున్న క్రమంలోనే ఆ యువతిని ప్రదీప్ అనే ప్రిన్సిపాల్ వేధించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయం చివరికి ప్రియుడు ఉపేంద్ర కౌశిక్ కు తెలియడంతో పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఎలాగైన ప్రిన్సిపాల్ పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే కౌశిక్ గత కొన్ని రోజుల నుంచి ప్రిన్సిపాల్ ప్రదీప్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు. పక్కా ప్లాన్ తో వెళ్లిన ఆ కౌశిక్ ఇటీవల ప్రిన్సిపాల్ ను ప్రదీప్ ను ఓ చోట పట్టుకున్నాడు.
ఆ తర్వాత నా ప్రియురాలినే వేధిస్తావా అంటూ అతనితో గొడవకు దిగాడు. దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన కౌశిక్.. తన వెంట తెచ్చుకున్న సుత్తితో ప్రిన్సిపాల్ ప్రదీప్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రిన్సిపాల్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచాడు. అనంతరం ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కౌశిక్ అనే యువకుడు ప్రిన్సిపాల్ ను హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలించి ఎట్టకేలకు నిందితుడు కౌశిక్ ను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.