కరోనాతో ప్రపంచంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్యాసంస్థలు మూతపడడంతో విద్యా సంస్థలు పాఠశాలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాయి. ఇదే విద్యార్థులకు షాపంగా మారింది. ఆన్ లైన్ తరగతుల పుణ్యమా అంటూ ప్రతీ పిల్లాడికి మొబైల్ ఫోన్ అవసరం ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ప్రతీ ఇంట్లో అదనంగా మొబైల్ ను కొనుగోలు చేశారు.
ఆన్ లైన్ తరగతుల వల్ల ఎంత చదువు నేర్చుకున్నారనేది పక్కనపెడితే మొబైల్ ఫోన్ లకు అడెక్ట్ అయ్యారని మాత్రం పూర్తిగా తెలిసిపోయింది. ఇక కరోన కారణంగా స్కూల్ లకు పూర్తిగా సెలవులు రావడంతో టీవీలు, సెల్ ఫోన్ లతో పిల్లలు కాలక్షేపం చేశారు. ఇక ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా స్కూల్స్ తెరుస్తుండడంతో పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా టైమ్ లో టీవీ చూడటం పూర్తిగా అలవాటు చేసుకున్న ఓ బాలిక టీవీ చూస్తానంటూ తల్లితో గొడవకు దిగింది.
ఇది కూడా చదవండి: Visakhapatnam: ఇంటర్మీడియట్ లోనే ప్రేమలో పడింది! పెళ్లికి ప్రియుడు నిరాకరించాడని!
దీంతో వద్దని చెప్పి తల్లి కూతురిని మందలించింది. దీంతో మనస్థాపానికి చెందిన ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది చెన్నైలోని మాధవరంలోని తెలుగు కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన నాగరాజ్ కుమార్తె ఏంజల్ (12) మాధవరం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.
అయితే ఏంజల్ ఇంట్లో ఎక్కువ సమయం టీవీ చూస్తుండడంతో తల్లి కుమార్తెను మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంతో కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.