డబ్బుపై వ్యామోహంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ రమ్మీ మైకంలో పడి దాచుకున్న సొమ్మునంత దారపోసి ఆర్థికంగా చితికిపోయాడు. ఇక ఈ క్రమంలోనే రమ్మీలో ఆడేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు, దాచుకున్నది కరిగిపోయింది, సంపాదించుకున్నది ఖర్చు అయిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలోనే డబ్బుకు కక్కుర్తిపడి ఏకంగా కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిని సైతం అమ్ముకుని రమ్మీలో పెట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని విజయవాడకు చెందిన నర్సింహరాజు(38) 11 ఏళ్ల క్రతం చైన్నైలోని తిరుచ్చిలో స్థిరపడ్డాడు. అక్కడే పని చేసుకుంటూ కొన్నాళ్లు జీవితాన్ని నెట్టుకొచ్చాడు. ఇక కొన్నాళ్లకి నర్సింహరాజు తిరువానై కావల్‌కు చెందిన శివరంజని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే నర్సింహరాజు గత ఏడాది నుంచి ఆన్ లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడు. మొదట్లో బాగానే డబ్బులు వచ్చాయి. ఇక ఇదే ఆశతో రోజు రోజుకు సంపాదించిన డబ్బులను అందులోనే దార పోశాడు. ఆర్థికంగా చితికిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి సమయపురం శక్తి నగర్‌లో సొంతిల్లును నిర్మించుకున్నారు.
ఇది కూడా చదవండి: Sri Sathya Sai: ప్రేమ పేరుతో దారితప్పారు. సహజీవనం చేస్తూ కుటుంబాల్లో చిచ్చుపెట్టారు!
ఎలాగైన దీనిని అమ్మేసి రమ్మీలో పెట్టుకోవచ్చనే ఆలోచనలో నర్సింహరాజు కలలు కంటున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్యకు తెలియకుండా తన సోంతంటిని రూ.28 లక్షలకు అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బుతో మళ్లీ రమ్మీలో పెట్టడం మొదలు పెట్టాడు. సొంత ఇల్లును అమ్మిన విషయం భార్య శివరంజినికి తెలిసింది. కోపంతో ఊగిపోయి భర్తను నిలదీసింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరిగాయి. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. ఇక కోపంతో ఊగిపోయిన భర్త భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇంట్లో పెట్టాడు.
ఇక శివరంజికి ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో అనుమానం రావడంతో అల్లుడికి ఫోన్ చేశారు. అతని నుంచి కూడా ఎలాంటి రిప్లయ్ రాలేదు. దీంతో ఆందోళనకు గురైన శివరంజిని తండ్రి అల్లుడిని సంప్రదించాడు. ఏంటని ప్రశ్నిస్తే మీ కూతురికి కరోనా వచ్చిందని, పిల్లలు మాత్రం నా వద్ద ఉన్నారని, మీ కూతురు ఇంట్లో ఉందని తెలిపాడు. దీంతో అనుమానమొచ్చిన శివరంజిని తండ్రి వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూశాడు. ఇంట్లో విపరీతమైన దుర్వాసన రావడంతో బెడ్ కింద చూసేసరికి కూతురిని హత్య చేసి కవర్ లో చుట్టి దాచిపెట్టాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించాడు. అనంతరం భర్త నర్సింహరాజుపై పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.