నేటి కాలం యువతి యువకులు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ముందుగా తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. చివరికి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో చివరికి ప్రియుడితో లేచిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అచ్చం ఓ కూతురు ఇలాగే చేయడంతో ఆ యువతి తల్లిదండ్రులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వీరి లవ్ స్టోరీలో ఏం జరిగింది? ఆ యువతి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలోని తుత్తుకుడి ప్రాంతంలో ఓ యువతి తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. అయితే ఈ అమ్మాయికి రోజు కాలేజీకి వస్తూ పోతూ ఉండే క్రమంలో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఇక ఒకరికి ఒకరు నచ్చుకోవడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. దీంతో ఈ ప్రేమ జంట సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. అలా కొంత కాలం పాటు వీరి ప్రేమాయణం సాగుతూ వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్ది ఒకరిని విడిచి మరొకరు ఉండకపోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇదే విషయం ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పింది. కూతురు మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
అవన్ని మానుకోని ఇకనుంచైనా బుద్దిగా ఉండాలని తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చారు. అయినా బుద్ది మార్చుకుని ఆ యువతి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక ఇలా అయితే కాదని భావించిన ఆ యువతి ఇటీవల ప్రియుడితో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కూతురు చేసిన పనికి గ్రామంలో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.