సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలీలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇటు సినిమాల నుంచి అటు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ ట్విట్టర్ లో వార్ క్రియేట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆర్జీవీపై చీటింగ్ కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. విషయం ఏంటంటే? ఆర్జీవీ సమర్పణలో యదార్థ ఘటన ఆధారంగా విడుదలైన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’.
నవంబర్, 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఘటనలో భాగంగా నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. అయితే గతంలో ఈ సినిమా చూట్టు అనే వివాదాలు అలుముకున్నాయి. దీంతో అనేక సార్లు మూవీ వాయిదా పడుతూ వచ్చి జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇది కూడా చదవండి: Akira Nandan: అకీరా నందన్ టాలెంట్‌కు పవన్ ఫ్యాన్స్ ఖుషి.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో శేఖర్ రాజు అనే వ్యక్తి వర్మకు పరిచయం అయ్యాడు. వీరిద్దరి పరిచయంతోనే వర్మకి శేఖర్ జనవరి 2020లో ₹ 8 లక్షలు, తర్వాత మరో ₹ 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఈ మొత్తాన్ని వర్మ ‘ఆశ’ సినిమా విడుదలకు ముందే తనకి తిరిగి ఇస్తానని హామి ఇచ్చినట్లు శేఖర్ తెలిపారు.
ఇక వర్మ చెప్పిన సమయం దాటిపోవడంతో పాటు ‘ఆశ’చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకి తెలిసిపోయిందట. దీంతో మోసపోయానని శేఖర్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వర్మపై చీటింగ్ కేసు నమోదు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.