సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలీలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇటు సినిమాల నుంచి అటు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ ట్విట్టర్ లో వార్ క్రియేట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆర్జీవీపై చీటింగ్ కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. విషయం ఏంటంటే? ఆర్జీవీ సమర్పణలో యదార్థ ఘటన ఆధారంగా విడుదలైన చిత్రం ‘ఆశ ఎన్‌కౌంటర్’. నవంబర్, 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన […]