ఆమె పేరు షీలా సెలియోనే. బ్రిటన్ లోని షేక్ హోమ్ ప్రాంతంలోని ఓ ప్లాట్ లో గత కొంత కాలం నుంచి ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ కనిపించకుండా పోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆమె కట్టాల్సిన ఇంటి రెంట్ కూడా దగ్గరపడుతోంది. దీంతో ఓనర్ ఆమె గురించి చాలా రోజులు నుంచి ఎదురు చూశాడు. ఇక ఆమె రాకపోవడంతో ఆమె జమ చేసుకున్న సొసైటీ ఫండ్ నుంచి ఓనర్ నెల నెల అద్దె కూడా తీసుకున్నాడు.
కొంత కాలానికి ఆ మహిళ కనిపించకుండాపోవడంతో ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆమె ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు. అలా ఒక నెల కాదు, రెండు నెలల కాదు ఏకంగా రెండున్నరేళ్ల తర్వాత ఆ మహిళ చనిపోయి ఉన్న డెడ్ బాడీ, అస్థిపంజరాలతో సహా ఆమె ఉంటున్న ఇంట్లోనే కనిపించింది. ఈ సీన్ ను చూసిన ఆ అపార్ట్ మెంట్ ఓనర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: వీడో నీచమైన ప్రబుద్దుడు.. ప్రేమ జంటలే టార్గెట్ గా చేసుకుని!
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరాలను తీసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. ఇక రిపోర్టులో కూడా ఆమె మరణానికి అసలు కారణం ఏంటో తెలియరాలేదు. ఈ విషయంపై స్పందించిన న్యాయస్థానం రెండున్నరేళ్లుగా ఆమెను గుర్తించకలేకపోవడం అనేది జీర్ణించుకోలేని విషయమని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.