SIM CARD : చిన్న పిల్లలకు ప్రాణం విలువ తెలీకుండా పోతోంది. చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఓ బాలుడు కొత్త సిమ్ కార్డు అడిగితే కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్రేమసాగర్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. అతడి ఫోన్‌లో ఉన్న సిమ్‌కు సిగ్నల్స్ సరిగా రావటం లేదని, కొత్త సిమ్ కొనివ్వాలని తల్లిదండ్రులు సనప ముసలయ్య- పద్మలను అడిగాడు.
వారు కుదరదని అన్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతడ్ని గుండాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మెరుగైన చికిత్సకోసం కొత్తగూడెం తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఆ తర్వాత అతడ్ని కొత్తగూడెం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృత్యువాత పడ్డాడు. సూసైడ్ కేసు నోమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పురుషుడ్ని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపిన మహిళలు.. ఎందుకంటే?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.