భార్యలు పుట్టింటికి వెళ్లడం సాధారణ విషయం. పండగలు, శుభకార్యాలు, ప్రసూతి సమయం.. ఇలా ఏదో ఒక సందర్భంలో పుట్టింటికి వెళ్లి వస్తుంటారు. ఇదేం కొత్త విషయమేమీ కాదు. కాకుంటే వెళ్లి రాకపోతేనే అసలు సమస్య. ఇలాగే, ఓ భార్య తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త తన ప్రైవేట్ భాగాన్ని నరుక్కున్నాడు. రక్తం మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బీహార్‌లోని మాధేపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రజనీ నయానగర్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కృష్ణ బసు అనే వ్యక్తికి మలోధ్ ప్రాంతానికి చెందిన అనితతో కొన్నేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడితో సహా నలుగురు సంతానం. అయితే, సొంతూరులో పనులు లేకపోవడంతో కృష్ణ పని కోసం పంజాబ్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. వీలు దొరికినపుడు రావడం.. భార్యాపిల్లలను చూడటం.. మళ్లీ వెళ్లడం చేసేవాడు. అలానే రెండు నెలల కిందట తన సొంత ప్రాంతమైన మాధేపురాలోని రజనీ నయానగర్‌కు వచ్చాడు. ఆ సమయంలో భార్య ఇంట్లో లేదు.
ఈ విషయంపై.. పిల్లలను ప్రశ్నించగా, అనిత పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటున్నట్లు వారు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ శుక్రవారం రాత్రి పదునైన కత్తితో తన ప్రైవేట్ భాగాన్ని నరుక్కున్నాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న అతడిని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనలో అతనికి ప్రాణాపాయం లేనప్పటికీ.. ప్రైవేట్ పార్ట్ అతికించడం కొంచెం కష్టమైన పనే అని వైద్యులు తెలిపారు. అయితే, కృష్ణ మానసికస్థితి సరిగా లేదని స్థానికులు, కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్యపై కోపంతో ఇలా ప్రైవేట్ పార్ట్ నరుక్కోవడం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bihar man chops off his private part after wife stays back at parents’ home pic.twitter.com/4sXBJbw4d1
— Nitish Shekhawat (@nitishshekhawa1) January 21, 2023