ప్రేమ.. కులంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, వయసుతో అసలుకే పని లేదు. కానీ కొందరు యువతీయువకులు అన్నాచెల్లెళ్లు అనే మాటే మర్చిపోయి ప్రేమ పేరుతో కుటుంబ బంధాలకు తూట్లు పొడుస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. ఇక పెద్దలు కాదనేసరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ రాష్ట్రంలోని బంకాలోని కటోరియా పరిధిలోని బదాసన్ అనే గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతీయువకుడు వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే అన్నాచెల్లెళ్లు కావడంతో తరుచు మాట్లాడుకునే వారు. అలా వారి మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఎందుకో ప్రేమించుకుందామని ఆలోచన వచ్చింది. దీంతో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. ఇదే విషయం ఇరువురి కుటుంబాల్లో తెలియడంతో ఇద్దరిని మందలించి కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచారు.
ఇది కూడా చదవండి: పెళ్లై మూడు రోజులే.. భర్తను కాదని కొత్త పెళ్లి కూతురు సొంత మామను!
ఇక కొన్ని రోజుల తర్వాత ప్రేయసిని చూసేందుకు ప్రియుడు తిరిగి ఇంటికొచ్చాడు. అదే రోజు రాత్రి ఎవరులేని చోటుకు వెళ్లారు. కొద్ది సేపు ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. దీంతో బతికుండగా కలిసుండలేకపోవడం కన్నా చనిపోవాలనే ఆలోచనకు వచ్చారు. అనుకున్నట్లుగానే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణంతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.