అతనికి నెలకు రూ. 80 వేల జీతం, అందమైన భార్య. జీవితంలో ప్రతీ ఒక్కరు కోరుకునేది కూడా ఇదే కావచ్చేమో. కానీ అతడికి మాత్రం అవి సరిపోలేదు. డబ్బుపై వ్యామోహంతో మరింత కూడబెట్టాలనుకున్నాడు. వచ్చిన జీతాన్ని వచ్చినట్టే జల్సాలకు ఖర్చుపెట్టడం మరీ ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో భార్యను పుట్టింటి నుంచి డబ్బు తేవాలంటూ వేధింపులకు దిగేవాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భర్త భార్యను దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా బెంగుళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..బెంగుళూరులోని హాసన్ తాలూకా దొడ్డమండిగనహళ్లికి చెందిన మంజునాథ్, తేజస్విని భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా ఏళ్లే గడుస్తుంది. భర్త బెంగళూరులో ఒక ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు. భర్త జీతం నెలకు రూ.80 వస్తుండడంతో తాము కోరుకున్న జీవితానికి దగ్గరలో ఉన్నానని భార్యాభర్తలు ఎంతో సంబరపడ్డారు. కానీ వచ్చే జీతంతో భర్త మంజునాథ్ సర్దుకోలేకపోయాడు. ఇంకా కూడబెట్టాలని అనేక మార్గాలు వెతికాడు. దీంతో క్రికెట్ బెట్టింగ్ లో పడి మొదట్లో బాగానే వెనకేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: YSR District: భర్తను చేసుకున్నందుకు ఏనాడు సుఖం దక్కలేదు.. అలా చేయొద్దంటూ మొత్తుకున్నా వినకుండా!
కానీ అలా బెట్టింగ్ పెడుతున్నకొద్ది అనంతరం తీవ్రంగా నష్టాలపాలయ్యాడు. వచ్చే జీతం కూడా బెట్టింగ్ కే పెట్టేవాడు. దీంతో సంసారంలో కలహాలు మొదలై భార్యాభర్తల కాపురంలో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో బెంగుళూరు నుంచి మకాం మార్చిన ఈ దంపతులు హసన్ లో నివాసం ఉన్నారు. దీంతో అక్కడ భార్య చిన్నఉద్యోగానికి దిగింది. ఆర్థికంగా నష్టాలపాలైన మంజునాథ్ కు ఏం చేయాలో అర్థంకాలేదు. భార్యను పుట్టింటికి వెళ్లి డబ్బు తేవాలంటూ అనేక సార్లు వేధించాడు.
ఇంతటితో ఆగకుండా కొన్నాళ్లకి భార్యను అనుమానించడం కూడా మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవల చెలరేగాయి. సోమవారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో మంజునాథ్ కోపంతో ఊగిపోయి భార్యను బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో నిందితుడు మంజునాథ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.