దేశంలో ఊహించని దారుణాలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాల్లో ప్రతీ చిన్న విషయాలకే క్షణికావేశంలో తీవ్రమైన దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ఆలస్యంగా ఇంటి తలుపులు తీసిందని భర్త కోపంతో ఊగిపోయాడు. దీంతో తట్టుకోలేని భర్త ఏకంగా భార్యను దారుణంగా నరికి చంపాడు. బెంగుళూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలోని కామాక్షి కాలనీలో మంజుల అనే వివాహిత నివాసం ఉంటుంది.
అయితే మంజుల గతంలో పెళ్లి చేసుకుని భర్తను వదిలేసి రాము అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. అయితే భర్త రాము కూలీ పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. దీంతో వీరి కాపురం ఎంతో సంతోషంగానే సాగుతూ ఉంది. ఇదిలా ఉంటే రాము ఇటీవల కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి డోర్ కొట్టాడు. ఎంతకూ కూడా భార్య డోర్ తీయలేదు. దీంతో భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. చాలా సేపటి తర్వాత భార్య డోర్ తీసింది. వెంటనే డోర్ ఎందుకు ఆలస్యంగా తీశావంటూ భార్యతో గొడవకు దిగాడు.
ఇది కూడా చదవండి: Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!
ఈ నేపథ్యంలోనే భార్య మంజుల భర్తకు భోజనం కూడా పెట్టలేదు. దీంతో రాము కోపం మరింత ఎక్కువైంది. దీంతో తట్టుకోలేని భర్త భార్య మంజులను దారుణంగా నరికి హత్య చేశాడు. దీంతో మంజుల అరుపులు విన్న స్థానికులు వచ్చి చూసే సరికి మంజుల రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రామును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.