కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. బర్త్ డే స్టేటస్ పెట్టలేదని ఓ వ్యక్తిని కొందరు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
భూ తగాదాల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకోవడం, ప్రేమ వివాహల కారణంగా పరువు కోసం హత్య చేయడం వంటి దారుణాలు చూశాం. కానీ, పుట్టిన రోజు స్టేటస్ పెట్టలేదని హత్య చేయడం ఎక్కడైనా విన్నారా? కానీ, బెంగుళూరులో అదే జరిగింది. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. బర్త్ డే స్టేటస్ పెట్టలేదని కొందరు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా కొడవలితో నరికి చంపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? బెంగుళూరులోని జోగుపాళ్య ప్రాంతంలో విల్సన్ గార్డెన్ నాగ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతడు స్థానిక ప్రజలను భయందోళనలకు గురి చేస్తూ కరుడుగట్టిన రౌడీ షీటర్ గా పెరు పొందాడు.
ఎన్నో నేరాల్లో పాలు పంచుకుని చాలా కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. ఇకపోతే ఇతని వద్ద చాలా మంది రౌడీ షీటర్లు సహచరులుగా పని చేస్తుండేవారు. అందులో ఒక రౌడీ షీటర్ పేరు కార్తిక్. విల్సన్ గార్డెన్ నాగ వద్ద ఎన్నో రోజులుగా నమ్మకంగా ఉంటూ మార్కులు కొట్టేస్తుండేవాడు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 8న కార్తిక్ పుట్టిన రోజు కావడం విశేషం. అతని పుట్టిన రోజు సందర్భంగా తన గురువు అయిన విల్సన్ గార్డెన్ నాగ స్టేటస్ పెట్టలేదు. ఇదే కార్తిక్ కు కోపాన్ని తెప్పించింది. దీంతో పాటు విల్సన్ గార్డెన్ నాగ కార్తిక్ ను గతంలో అనేక సార్లు ఘోరంగా అవమానించినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటినీ మనుసులో పెట్టుకున్న కార్తిక్.. విల్సన్ గార్డెన్ నాగను తన తోటి సహచరులతో కలిసి హత్య చేయాలని అనుకున్నాడు. ఆ రోజు కార్తిక్ తన స్నేహితులతో కలిసి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు.
ఇక ఏప్రిల్ 11న ఉదయం తెల్లవారుజామున పథకం ప్రకారమే కార్తిక్ కార్తిక్.. జాన్సన్, మగ్గేష్, కార్తీక్, అరుణ్ తో పాటు మరో ఇద్దరి సాయం తీసుకుని విల్సన్ గార్డెన్ నాగ ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కార్తిక్ కొడవళ్లతో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగను ఆరుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇన్ని కారణాలతో సహచరులు విల్సన్ గార్డెన్ నాగను దారుణంగా హత్య చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.