యూనివర్శిటీలోకి చొరబడి యువతిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. క్యాంపస్‌లోనే ఆమెపై కత్తితో దాడి చేసి చంపాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడచుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని కోలార్ జిల్లా, ముల్‌బాగల్ తాళాకాకు చెందిన లయ స్మిత, పవన్ కల్యాణ్ స్నేహితులు. వీరు బెంగళూరులోని వేరు వేరు కాలేజీల్లో చదువుతున్నారు. లయ బెంగళూరులోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బీటెక్ చదువుతుండగా.. పవన్ ఓ ప్రైవేట్ కాలేజ్‌లో బీసీఏ చదువుతున్నాడు. సోమవారం పవన్ కల్యాణ్.. లయ ఉంటున్న యూనివర్శిటీకి వెళ్లాడు. ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ, పవన్.. లయపై కత్తితో దాడి చేశాడు.
19 సార్లు అతి కిరాతకంగా పొడిచాడు. గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. లయ అరుపులు విని అక్కడికి వచ్చిన కొందరు రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఇద్దరినీ గుర్తించారు. కాలేజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. వారిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎందుకు ఆమెను చంపాడన్న దానిపై విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.