ఇద్దరూ మూడేళ్ల పాటు పోటాపోటీగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. భర్తను వేరు కాపురం కోసం ఆమె బలవంతం పెట్టింది. అతడు ఒప్పుకోకపోవటంతో..
వారిద్దరిదీ ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి మరీ ఒక్కటయ్యారు. ప్రేమించుకునే సమయంలో చేసుకున్న బాసల్ని పెళ్లి తర్వాత మర్చిపోయారు. ఒకే ఇంట్లో కలిసుంటూనే బద్ధ శత్రువులుగా మారిపోయారు. భర్త తన మాట వినటం లేదని ఆ యువతి అత్యంత దారుణానికి పాల్పడింది. భర్త, అత్తపై సోదరులతో కలిసి దాడి చేసింది. ఈ దాడిలో గాయపడ్డ అత్త చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెళగావి జిల్లా, బెలెహుంగల పట్టణానికి చెందిన సుభాన్, మెహరున్నీ మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు.
పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు. అత్తారింట్లో అడుగు పెట్టిన కొన్ని నెలలకే మెహరున్నీ భర్తతో గొడవలుపడ్డం మొదలెట్టింది. వేరు కాపురం పెడదామంటూ సుభాన్‌పై ఒత్తిడి తేసాగింది. తల్లి మహబూబీని వదిలి తాను రాలేనని సుభాన్ తేల్చి చెప్పాడు. దీంతో మెహరున్నీ భర్త, అత్తపై కక్ష గట్టింది. మే 22న తన సోదరులను తీసుకుని అత్తింటికి వచ్చింది. వేరు కాపురం విషయంలో భర్తతో గొడపడింది. అతడు అప్పుడు కూడా అదే చెప్పాడు.
దీంతో మెహరున్నీ, అతడి సోదరులు సుభాన్‌పై, మహబూబీపై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం సుభాన్ కోలుకున్నాడు. మహబూబీ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. ఇప్పటికే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.