ప్రేమ… కులంతో పని లేదు. భాష, ప్రాంతంతో అసలే పని లేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మైనర్ పిల్లలు ఊహ తెలియని వయసులోనే ప్రేమలో పడిపోతున్నారు. సమాజం అంటే ఏంటో తెలియదు, ఆలోచించే పరిణితో ఉండదు. ఈ వయసులోనే కన్న ప్రేమను కాదని యువకుడితో ప్రేమలో పడిపోతున్నారు. కాదంటే హత్యలు, ఆత్మహత్యలు.. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ మైనర్ బాలిక, ఓ యువకుడి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన అజిత(16), బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు తట్టుకోలేకపోయారు.
ఇక మనస్థాపంతో ముందుగా అజిత స్థానిక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మరణించిన విషయం తెలుసుకున్న అజయ్.. తను కూడా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మహత్యతో ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలా తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుని.. కాదంటే ఆత్మహత్మ చేసుకుని కన్నవారి వారికి తీరని శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచి వెళ్లిన వీరి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.