ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే ఎంతో ఎమోషన్ కి గురై డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.
ఈ మద్య కొంతమంది క్షణికావేశంలో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి కావడంతో క్షణికావేశంలో విచక్షణ కోల్పొయి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు.. కొన్నిసార్లు హత్యలు కూడా చేస్తున్నారు. ఓ యువకుడు తాను ప్రేమిస్తున్న యువతి కోసం నడిరోడ్డుపై కత్తితో హల్ చల్ చేశాడు..యువతి ప్రయాణిస్తున్న బస్సును ఆపి డ్రైవర్ తో పాటు ప్రయాణీకులను కత్తితో బెదిరించి హడలెత్తించాడు. ఈ ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి కసికోట మండలానికి చెందిన గడసాల శివసాయి అనే యువకుడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కాకపోతే శివసాయి ది వన్ సైడ్ లవ్ కావడంతో ఆమెతో ఎలాగైనా మాట్లాడి తన ప్రేమ విషయం చెప్పాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఆమె ప్రయాణిస్తున్న బస్ ని వెంబడిస్తూ ఆపేందుకు ప్రయత్నించేవాడు..కానీ బస్ డ్రైవర్ ఆపకుండా వేళ్లేవాడు. ఈ క్రమంలో యువతి ప్రయాణిస్తున్న కాలేజ్ బస్ బయ్యవరం వైపు వస్తున్న విషయం తెలుసుకొని తన స్కూటీతో వచ్చాడు. బస్సు ఎదురుగా స్కూటీని ఆపి బస్ లో ఉన్న తన ప్రియురాలిని బయటకు దింపాలని తనతో తెచ్చుకున్న ఓ కత్తితో డ్రైవర్ ని బెదిరించాడు. దాంతో బస్ లో ప్రయాణిస్తున్న వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం సమయంలో జరిగింది. బయ్యవరం నుంచి తేగాడ వైపు వస్తున్న కాలేజ్ బస్ లో తాను ప్రేమిస్తున్న యువతి ఉందనుకొని గడసాల శివసాయి బస్ ని ఆపి డ్రైవర్ ని నానా బూతులు తిడుతూ తన లవర్ ని కిందకు పంపాని డిమాండ్ చేశాడు.. లేదంటే చంపేస్తానని డ్రైవర్ మెడపై కత్తిపెట్టి హత్యాయత్నం చేయబోయాడు. ఆ బస్ లో యువతి లేదని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బస్ డ్రైవర్ కసీంకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు 23న గడసాల శివసాయిని అరెస్ట్ చేశారు.