ఈ మధ్యకాలంలో కొందరు కొత్తగా పెళ్లైన వధువులు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. అత్తింటివాళ్లు విపరీతమైన వేధింపులకు గురి చేయడం, భర్త అనుమానంతో చూడటం, వరకట్నపు వేధింపులు వంటి కారణాలతో కొత్తగా పెళ్లైన వివాహితలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇటీవల అత్తింటి వేధింపులకు భరించలేక హైదరాబాద్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇలాంటి వేధింపుల కేసులో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రాజుర గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కండేపల్లి గ్రామానికి చెందిన సంతోషి అనే యువతిని పృథ్వీరాజ్ గతేడాది ఘనంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లిలో భాగంగా వివాహ సమయంలో అత్తింటివాళ్లు రూ.18.50 లక్షల నగదు, బంగారంతో పాటు ఇతర లాంచనాలను ముట్టచెప్పారు.
ఇది కూడా చదవండి: Green Bawarchi: హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బిల్డింగ్ మీదనుంచి దూకేసిన ఇద్దరు వ్యక్తులు
ఇక పెళ్లైన మూడు నెలల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక రోజులు గడిచే కొద్ది భర్త ప్రవర్తనలో మార్పొచ్చి భార్యను వరకట్న వేధింపులకు గురి చేశాడు. కొన్నాళ్లు భరించిన సంతోషికి వేధింపులు రోజు రోజుకు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే సంతోషి తల్లిదండ్రులు అదనంగా రూ.6 లక్షలు ఇవ్వడంతోపాటు నిర్మల్‌లో ప్లాట్ కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా భర్త వరకట్న వేధింపులకు భార్య సంతోషి తట్టుకోలేకపోయింది.
భర్త టార్చర్ ను తట్టుకోలేక భార్య సంతోషి శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న సంతోషి తల్లిదండ్రలు ఘటన స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న సంతోషిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ సంతోషి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.