ఆమెకు ఏడేళ్ల కిందట స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఆ మహిళ భర్తతో బాగానే సంసారం చేస్తూ వచ్చింది. అలా కొంత కాలం తర్వాత ఆ మహిళకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇక పట్టిన పిల్లలను చూసుకుంటూ ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల భర్త పని నిమిత్తం బయటకు వెళ్లాడు. పట్టపగలు బయటకు కూడా జనాలు ఎక్కువగా కనిపించ లేదు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ వివాహిత తన ఇంటి తలుపులు వేసి ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో ఆ వివాహిత తలుపులు ఎందుకు వేసుకుంది? ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రాంతంలోని రెడ్డి కాలనీ. ఇక్కడే ప్రశాంత్ రెడ్డి, వేదశ్రీ (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు కుమారులు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఈ దంపతులు సంతోషంగానే జీవిస్తూ వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఇటీవల వేద శ్రీ ఊహించని నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం బయట జనాలు పెద్దగా కనిపించలేదు. ఇక ఇంట్లో భర్త కూడా లేడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ వివాహిత తన ఇద్దరు పిల్లలను ఇంట్లోకి తీసుకుని గది తలుపులు పెట్టింది.
ఆ తర్వాత ముందుగా తన పిల్లలపై కిరోసిన్ పోసి, ఆ తర్వాత తనపై పోసుకుంది. ఇక వెంటనే నిప్పంటించుకుంది. దీంతో పిల్లలు అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. వెంటనే స్థానికులు హుటాహుటిన వేద శ్రీ ఇంటి తలుపులు పగలకొట్టి ముగ్గురుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో వేద శ్రీ మరణించగా, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వేద శ్రీ చనిపోయిందని తెలుసుకున్న ఆమె భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్న అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.