ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయిని అతడు ప్రాణంగా ప్రేమించాడు. ఇక ఎలాగో చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. పెళ్లైన నెల రోజులకే ఆ నవ వధువు భర్తకు ఊహించని షాకిచ్చింది. అసలేం జరిగిందంటే?
సోషల్ మీడియా యుగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది వద్ద స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగక.. వ్యవసాయం పనులకు వెళ్లే వారి నుంచి, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు.. ఇలా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా అకౌంట్ లను వాడుతున్నారు. అచ్చం ఇలాగే ఫేస్ బుక్ ను ఉపయోగించిన ఓ యువకుడికి ఓ యువతి పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన నెల రోజులకే భార్య.. భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. అసలేం జరిగిందంటే?
స్థానికుల కథనం ప్రకారం.. అది తమిళనాడులోని విల్లుపురం జిల్లా మేల్మలయనూరు పరిధిలోని సిరుతలైపూండి గ్రామం. ఇక్కడే మణింకదన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం పనులు చేసుకునే ఇతనికి… గతంలో మహాలక్ష్మి అనే అమ్మాయి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. అలా వీరి పరిచయం కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక నాకు ఎవరూ లేరని, నేను అనాథనంటూ మహాలక్ష్మి మణికందన్ తో చెప్పింది. ప్రియురాలి మాటలు విన్న మణికందన్.. నీకు నేనున్నానంటూ తన తల్లిదండ్రులను ఒప్పించుకుని గతేడాది నవంబరు 18న ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.
ఇక పెళ్లైన కొన్ని రోజుల పాటు మహాలక్ష్మి భర్తతో బాగానే ఉంటున్నట్లు నటించింది. అయితే పెళ్లై నెల తిరగకముందే మహాలక్ష్మి భర్తకు ఊహించని షాకిచ్చింది. విషయం ఏంటంటే? ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు నగలు, రూ. 1,00,000 లక్షలు తీసుకుని మహాలక్ష్మి డిసెంబర్ 11 నుంచి కనిపించకుండాపోయింది. అయితే ఉన్నట్టుండి భార్య మహాలక్ష్మి జాడ కనిపించకపోవడంతో భర్త ఖంగుతిన్నాడు. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదు. దీంతో భర్త మణికంధన్ ఇప్పటికీ భార్య ఆచూకి కోసం గాలిస్తున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.