ఆమెకు పెళ్లై 10 రోజులు దాటింది. దీంతో వధువు, వరుడితో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి ఓ గుడికి వెళ్లారు. అక్కడ వారి కళ్లు గప్పి ఆ నవ వధువు ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది.
ఓ నవ వధువు వరుడిని ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లైన 10 రోజులకే భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది. అయితే ఆ వధువు ప్రియుడి బైక్ ఎక్కి పారిపోతుండగా స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
అది ఉత్తర్ ప్రదేశ్ మిర్జాపూర్ లోని జౌన్ పూర్ ప్రాంతం. ఇక్కడే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి పెళ్లి వయసు రావడంతో అతని తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. ఇక కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ యువకుడు సరేనంటూ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అతని తల్లిదండ్రులు అజంగఢ్ కు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు. ఇక ఫిబ్రవరి 10న వీరిద్దరి బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం కూడా జరిగింది. ఇక ఇంటికి కోడలు వచ్చిందని వరుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. వీరి పెళ్లై పది రోజులు దాటింది. ఈ నేపథ్యంలోనే ఈ నవ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అంతా కలసి మా వింధ్యావాసిని ఆలయ దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇటీవల నవ దంపతులతో పాటు వారి ఇరువురి తల్లిదండ్రులు వెళ్లారు. అక్కడున్న ఆ దేవుడిని అందరూ దర్శించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆ నవ వధువు వాష్ రూంకు వెళ్తున్నానని వారి కళ్లు గప్పి కాస్త బయటకు వచ్చింది. చాలా సేపు అయింది. వాష్ రూంకు వెళ్లిన వధువు మాత్రం ఇంకా తిరిగి లేదు.
దీంతో ఖంగారుపడ్డ వధువు, వరుడు కుటుంబ సభ్యులు అక్కడున్న కాలనీలు అంతా వెతికారు. కానీ, ఆ వధువు జాడ మాత్రం దొరకలేదు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక చివరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వింధ్యావాసిని ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా… ఆ నవ వధువు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి.. ఓ యువకుడితో పాటు బైక్ ఎక్కి పారిపోయింది.
ఈ ఘటనపై విచారించగా ఆ వధువు తన ప్రియుడితోనే పారిపోయిందని పోలీసులు తేల్చారు. ఈ వార్తతో వధువు, వరుడు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. పెళ్లైన 10 రోజులకే భర్తను వదిలి ప్రియుడితో లేచిపోయిన ఈ నవ వధువు ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) February 21, 2023