ఈ మధ్య కాలంలోనే రోడ్లపైకి మైనర్ బాలురు అడ్డగోలుగా రయ్యు రయ్యుమంటూ తిరుగుతున్నారు. పది ఏళ్లు కూడా నిండని మైనర్లు బైక్‌లతో రోడ్లపై తమ రేంజ్‌ను చూపిస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా తోడవటంతో ఇష్ఠానుసారంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మైనర్ బుడతడు ఎలక్ట్రిక్ బైక్‌తో దూసుకెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పదేళ్లు కూడా లేని ఓ మైనర్ బాలుడు ఎలక్ట్రిక్ బైక్‌తో అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులకు చిక్కాడు. ఇక మనోడు బబుల్గమ్ నములుతూ పోలీసులనే భయం కూడా లేకుండా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ పోలీసుకు చుక్కలు చూపించాడు. ఇది ఎలక్ట్రిక్ బైక్ అని చిన్న పిల్లలు మాత్రం నడుపుతారని అంటున్నాడు. దీనికి లైసెన్స్ ఉండదని తెలివితో సమాధానమిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక పోలీసులు ఆ బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి వారి మధ్య కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.