భార్యాభర్తల సంసారంలో గొడవలు జరగడం సర్వ సాధారణం. కానీ ఇదే గొడవలకు కొంతమంది మహిళలు భర్తకు విడాకులు ఇవ్వడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక మరికొంతమంది మహిళలు మాత్రం భర్తతో గొడవల అని ఎత్తిచూపి అతనికి గుడ్ బై చెప్పి ప్రియుడికి హాయ్ చెబుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ ఇద్దరు పిల్లల తల్లి.., భర్తను కాదని ప్రియుడితో లేచిపోయింది. అలా కొంత కాలం పాటు ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసి చివరికి అతనితో పాటు కలిసి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు కన్యాకుమారి జిల్లా కుళచల్ కడియపట్నం గ్రామం. ఇక్కడే రాజేష్, షామిని (29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత ఈ భార్యాభర్తలకు ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఆ దంపతుల సంసారం బాగానే సాగింది. అలా సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్య భర్తతో ఉండలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక భర్త భార్యకు నచ్చజెప్పి భార్యను ఇంటికి రప్పించుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత భర్తతో నాకు సుఖం లేదని భావించిన షామిని సుసాయినాథ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక భర్తకు తెలియకుండా కొన్నాళ్ల నుంచి షామిని ప్రియుడితో తెర వెనుర ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇదే కాదండోయ్.. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని తెగ రొమాన్స్ చేసేది.
అలా కొంత కాలానికి వీరిద్దరి చీకటి ప్రేమాయణం ప్రియుడి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే షామిని సైతం భర్త రాజేష్ తో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. కట్ చేస్తే.. ఈ నెల 18న షామిని తన ఇద్దరి పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి కారులో లేచిపోయింది. ఇక డబ్బు ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసిన ఈ నకిలి ప్రేమికులు, డబ్బులు అయిపోగానే ఏం చేయలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక పిల్లలను కారులో పడుకోబెట్టి ఇద్దరు పురుగుల మందు తాగి కారులో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పిల్లలను రక్షించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత సంసారాలను పక్కన బెట్టి వివాహేతర సంబంధాల అంటూ తిరిగి చివరికి దిక్కులేని చావు చచ్చిన ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.