ఆనందం అంతలోనే ఆవిరి అంటే ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ ఫోటోలో అమ్మాయి, అబ్బాయి కనిపిస్తున్నార కదా. వీరిద్దరూ సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. రెండు చేతులా సంపాదన. ఇక జీవితానికి ఢోకా ఏముంటుంది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తమ ప్రేమ గురించి ఇద్దరి ఇంట్లోనూ చెప్పేశారు. ఇక పెళ్లి తంతు సిద్ధం చేసుకోవడమే తరువాయి
ఆనందం అంతలోనే ఆవిరి అంటే ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ ఫోటోలో అమ్మాయి, అబ్బాయి కనిపిస్తున్నారు కదా. వీరిద్దరూ సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. రెండు చేతులా సంపాదన. ఇక జీవితానికి ఢోకా ఏముంటుంది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తమ ప్రేమ గురించి ఇద్దరి ఇంట్లోనూ చెప్పేశారు. ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి. ఇంకొన్ని రోజుల్లో ఎలాగో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నామని.. భవిష్యత్ జీవితాన్ని ఊహించుకుని సంబరం పడ్డారు. మూడు ముళ్ల బంధంతో ఎలాగో ఒక్కటి కాబోతున్నామని తొందర పడ్డారు. ఇద్దరు సరస.. శృంగారాల్లో మునిగి తేలారు. ఊహించని పరిణామం.. ప్రాణాలు పోయేలా చేసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని గుండ్ల పేట్ తాలుకా చంద్ర శేఖర్, గోకక్ తాలుకా సుధారాణి బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా.. పెళ్లికి పెద్దలు అంగీకరించారు. చిక్కజాల తారాబనహళ్లిలో చంద్రశేఖర్ ఉంటున్న ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతుంటుంది సుధారాణి. ఈ నెల 10వ తేదీన రాత్రి అతడి ఇంటికి వచ్చింది సుధ. ఇద్దరు కలిసి బాత్రూములో స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ కిటీకీ, తలుపులు పూర్తిగా లాక్ చేశారు. స్నానం చేస్తూ శృంగారంలో మునిగిపోయారు. అంతలో బాత్రూములోని గ్యాస్ గీజర్ ఒక్కసారిగా కాలిపోయింది.
అందులో కార్బన్ మోనాక్సైడ్ విడుదలై.. బాత్రూమ్ అంతా వ్యాపించింది. స్నానం చేస్తూ సరససలాపాల్లో ఉన్న వీరిద్దరూ ఈ విషయాన్ని గ్రహించలేదు. మొత్తం వ్యాపించడంతో ఆ వాయువు పీల్చి ఇద్దరు స్నానపు గదిలోనే కుప్పకూలిపోయారు. ఉదయం ఇంటి యజమాని మరుసటి రోజు గ్యాస్ గీజర్ కాలిపోయిన విషయాన్ని గుర్తించి.. చూడగా.. స్నానం గదిలో వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగలకొట్టి మృతదేహాలను బయటకు తీశారు.