ఓ యువకుడు తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మరీ ఎందుకు తన సొంత చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలేం జరిగిందంటే?
నేటి కాలంలో కొందరు వ్యక్తులు వావి వరసలు మరిచి ప్రవర్తిస్తుంటారు. మరీ ముఖ్యంగా కొందరైతే వరసలు మరిచి చెల్లిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు అనేకం చూశాం. అయితే అచ్చం ఇలాగే ఓ అన్న.. దానికి కక్కుర్తి పడి తన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు సంతానం. అయితే వీరికి పెళ్లి వయసు కూడా వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ముందుగా కూతురి పెళ్లి చేసిన ఏడాదికి.. తమ కొడుకు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇదిలా ఉంటే.. టుండ్లా బ్లాక్ ఏరియాలో సీఎం సామూహిక వివాహాల వేదికను ప్రభుత్వం చేపట్టింది. ఈ వివాహ వేడుకలో పెళ్లి చేసుకునేందకు దాదాపుగా 51 జంటలు సిద్దమయ్యాయి. అయితే ఈ పెళ్లిలో భాగంగా ప్రభుత్వమే నూతన దంపతులకు దుస్తువులతో పాటు పెళ్లి ఖర్చులు, గృహోపకరణాలకు కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది.
అయితే ఇదే విషయం ఆ దంపతుల కుమారుడు తెలుసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే దుస్తువులతో పాటు పెళ్లి ఖర్చులు, గృహోపకరణాల అన్నీ పొందొచ్చని అనుకున్నాడు. ఇందులో భాగంగానే.. కక్కుర్తిపడ్డ ఆ యువకుడు, ఏకంగా అధికారుల కళ్లు గప్పి తన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు చెల్లిని పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. డబ్బులకు, గృహోపకరణాలకుఆశపడి చెల్లిని పెళ్లి చేసుకున్న ఈ యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.