ఆధార్.. ఆధార్.. ఆధార్. అన్నిటికీ ఇదే మూలం. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోవాలన్నా.. ఎదుటి వారు నీకు ఆధార్ కార్డు ఉందా! అని ప్రశ్నిస్తారేమో అన్న భయం. అంతలా మనిషి జీవితంలో ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అయితే, ఇంతటి విశిష్టత ఉన్న ఆధార్ కు సంబంధించి కీలక అప్డేట్ అందుతోంది.
ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో అందరికీ విదితమే. ఆధార్ లేనియెడల ఏ పని జరగదు కాదు కదా! మనకసలు గుర్తింపే ఉండదు. సిమ్ కొనాలన్నా.. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా అన్నింటికీ ఇదే ఆధారం. ఆఖరికి స్కూల్ పిల్లలను బడిలో చేర్చాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇంతవరకు అన్నీ సజావుగానే ఉన్నా.. కార్డుదారులు మరణించిన తర్వాత వారి ఆధార్ కార్డు ఏమవుతుంది..? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. దీని గురుంచి ఎవ్వరూ అలోచించి ఉండరు. ఒకవేళ ఆలోచన వచ్చినా.. చనిపోయిన వారి ఆధార్ కార్డుతో ఏం చేస్తారులే అని అలా పక్కన పడేస్తుంటారు. పొరపాటున ఆ వివరాలు నేరగాళ్ల చేతికి చిక్కితే.. మిస్‌యూజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ఆధార్ జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇలాంటి వారి ఆధార్ వివరాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
కార్డుదారులు మరణించిన క్రమంలో వారి ఆధార్ కార్డును వెంటనే రద్దు చేసే దిశగా యూఐడీఏఐ అడుగులు వేస్తోంది. అందుకోసం యూఐడీఏఐ సంస్థ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కార్డుదారులు మరణించినప్పుడు వారికి డెత్ సర్టిఫికెట్ జారీ అవ్వగానే ఆటోమేటిక్‌గా వారి ఆధార్ కార్డు రద్దు చేసేలా విధివిధానాలు సిద్ధం చేస్తోంది. అలా అని ఏకపక్షంగా ఇలా ఆధార్ ను రద్దు చేయరు. డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత, సంబంధిత వ్యక్తి కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియజేస్తారు. వారు అంగీకరిస్తేనే రద్దు చేస్తారు.
కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా ఆధార్ రద్దు చేస్తే, వారు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. మరణించిన వ్యక్తి పేరిట ఆస్తులు, పెట్టుబడులు, ఇన్సూరెన్సులు ఉంటే వాటిని ఉపసంహరించుకోవడంతో ఇబ్బందులు తలెత్తవచ్చు. వాటి క్లెయిమ్ కోసం భీమా సంస్థలు మరణించిన వారి ఆధార్ వివరాలు అడగవచ్చు. ముందుగానే రద్దు చేస్తే, వీటి క్లెయిమ్స్ తిరస్కరణకు గురి కావచ్చు. కావున ఇలాంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చాక యూఐడీఏఐ ఈ విధానంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈ విధానం అమలులోకి వస్తే.. మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్‌తో ఎలాంటి పథకాలు లబ్ది పొందేందుకు వీలు ఉండదు. ఆటోమేటిక్‌గా పథక ప్రయోజనాలన్నీ రద్దవుతాయి.
మరోవైపు.. ఇప్పటికే బర్త్ సర్టిఫికెట్ జారీ సమయంలో ఆధార్ నంబర్ కేటాయింపు విధానాన్ని తప్పనిసరి చేసింది.. యూఐడీఏఐ. ఇప్పటికే 20కిపైగా రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. మిగిలిన రాష్ట్రాలకు సైతం దీనిని త్వరలోనే విస్తరించనున్నారు. అలాగే.. 10 ఏళ్లలో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోని వారికి ఇప్పుడు ఉచితంగా అప్డేట్ చేసుకునే వేసులుబాటు కల్పిస్తోంది. మార్చి 15 నుంచి జూన్ 15 వరకు మూడు నెలల గడువులోగా ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. మరణించిన వారి ఆధార్ కార్డును రద్దు చేయాలనుకోవడం సరైన నిర్ణయమా..? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Unique Identification Authority of India (UIDAI) and the Registrar General of India have begun work on rolling out a mechanism that will allow for deactivation of Aadhaar once a death certificate is issued.https://t.co/DGY2hyOhfy
— Dr Shobha (@DrShobha) March 20, 2023