అన్ నోన్ కాల్స్ తో విసిగిపోతున్నారా? ఎవరు కాల్ చేశారో తెలియక తికమకపడుతున్నారా?.. త్వరలోనే వీటికి చెక్ పెట్టేదిశగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అడుగులు వేస్తోంది. ఈ రోజుల్లో అన్ నోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలంటే భయం. ఏ స్కామ్ గురుంచి చెప్పి డబ్బులు దొబ్బేస్తారో అని. గతకొంత కాలంగా కాల్స్ చేసి డబ్బులు దోచేస్తున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. మనకు తెలిసిన వారు కాల్ చేసుంటారేమో అని లిఫ్ట్ చేయడం.. మోసపోవడం.. ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. ఇకపై వీటన్నిటికీ ట్రాయ్ ఫుల్ స్టాప్ పెట్టనుంది.
మన ఫోన్ కాంటాక్ట్స్ జాబితాలో ఉన్నవారి నుంచి కాల్ వస్తే వారి పేరు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే పేరు తెలిసేది ఎలా? కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు.. మొబైల్ స్క్రీన్ పై వారి పేరు వచ్చేలా ట్రాయ్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగం (డాట్) తో ట్రాయ్ సమాలోచనలు నిర్వహించనుంది. త్వరలోనే ఇవి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు.
ఇది కూడా చదవండి: RBI Rules: నగదు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. లిమిట్ దాటి ట్రాన్సక్షన్స్ చేశారో బుక్కైనట్లే..!
ఇలాంటి ఫీచర్‌ను అమలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే ఆలోచిస్తోంది. ఈ విధానం అమలైతే కాల్ చేస్తున్న వారిని గుర్తించడంతోపాటు కచ్చితత్వం, పారదర్శకత, చట్టబద్ధత ఉంటుందన్నది ట్రాయ్ ఆలోచన. మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకునే సమయంలో టెలికం కంపెనీలకు వినియోగదారు అందించే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల ఆధారంగా కాల్ చేస్తున్నవారి పేరు ఫోన్ స్క్రీన్ మీద దర్శనమీయనుంది.
Unknown calls soon to end on mobile; govt setting its own ‘Truecaller’: Report
Trai to moot mechanism for Know Your Customer-based caller name display.
“We have just received a reference, and we will start work on this soon. Name as per KYC will appear when someone calls,”~TRAI pic.twitter.com/qnP8dqbsNg— 🇮🇳 Subash Vaid 🇮🇳 (@scvaid23) May 21, 2022