పుత్తడి అంటే మహిళలే గుర్తుకు వస్తారు. వీరు అలంకరణలో భాగంగా బంగారాన్ని భాగస్వామ్యం చేయడం వల్ల ఈ లోహానికి మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల పెళ్లిళ్లు సీజన్ కావడంతో భారీగా పెరిగిన పసడి ధర కాస్త తగ్గు ముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ క్రమ క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి.
నీ ఇల్లు బంగారం కానూ అంటే ఎవ్వరైనా కాదంటారా.. అవును మరి. ఎవ్వరికీ ఆశ ఉండదండీ బంగారం మీద. ధరకు, పేరుకు ప్లాటినం, వజ్రం విలువైనవే అయినప్పటికీ.. బంగారానికున్న క్రేజ్ వేరు. పుత్తడి అంటే మహిళలే గుర్తుకు వస్తారు. వీరు అలంకరణలో భాగంగా బంగారాన్ని భాగస్వామ్యం చేయడం వల్ల ఈ లోహానికి మరింత డిమాండ్ పెరిగింది. అయితే ఇటీవల పెళ్లిళ్లు సీజన్ కావడంతో భారీగా పెరిగిన పసడి, వెండి ధరలు కాస్త తగ్గు ముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ క్రమ క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,927.80 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. మన దేశంలో స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్స్ ధర పది గ్రాములకు రూ. 220 చొప్పున పెరిగింది. ఇక ఆర్నమెంట్ 22 క్యారెట్స్ బంగారం ధర 200లకు ఎగబాకింది. వెండి ధర కూడా ఈ బాటే పట్టింది. కేజీ సిల్వర్ ధర ఢిల్లీలో రూ. 500, హైదరాబాద్‌లో రూ. 900 పెరిగింది. ఇక ఆయా నగరాల్లో టాక్సులను బట్టి ధరలు ఉంటాయి. ఇక హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే… హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ.22 పెరిగింది. తులం బంగారం ధర నిన్న రూ. 58,850 ఉండగా.. పది గ్రాములపై రూ. 220 పెరగడంతో రూ. 59,070కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,950 ఉండగా, నేడు రూ.200 పెరగడంతో ఆదివారం నాడు గోల్డ్ ధర రూ.54,150గా చేరింది. కిలో వెండి ధర రూ. 75,700గా ఉంది.