బంగారం ధర గత పది రోజులుగా పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా.. బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉంది. ఒక రోజు భారీగా పెరుగుతుంది.. మరో రోజు అదే రేంజ్‌లో దిగి వస్తోంది. దాంతో బంగారం కొనాలనుకునే వారు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో బంగారం కొనాలునుకునే వారు.. కొన్ని రోజులు ఆగితే బాగుంటుంది అంటున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం బంగారం రేట్లు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఇక గత 10 రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. అయితే, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన క్రమంలో డాలర్ కాస్త పుంజుకుంటూ బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. మరి తగ్గిన ధర ఇలానే కొనసాగుతుందా.. మళ్లీ పెరుగుతుందా.. అనే అనుమానాలు ఉన్నాయి. మరి నేడు బంగారం ధర పెరిగిందా.. లేదా.. తులం పసిడి ధర ఎంత ఉంది అంటే..
ఇక నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో22 క్యారెట్ బంగారం తులం ధర స్థిరంగా ఉంది. ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ బంగారం తులం రేటు రూ.54,850 మార్క్ వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర తులం రూ.59,840 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.54,950 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ మేలిమి బంగారం ధర సైతం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.59,990 వద్ద ఉంది.
బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధర కూడా పసిడి బాటలోనే నడుస్తూ.. స్థిరంగా కొనసాగింది. ఇక నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76 వేల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని హస్తినలో కిలో సిల్వర్ రేటు క్రితం సెషన్‌తో పోలిస్తే ఇవాళ రూ.100 మేర పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో వెండి ధర కాస్త తక్కువగా.. బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. అందుకు స్థానిక ట్యాక్సులు కారణంగా చెప్పుకోవచ్చు.