బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. కొన్ని రోజుల పాటు భారీగా పెరగడం.. ఆ తర్వాత దిగి రావడం జరుగుతోంది. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బంగారం ధరలు నిత్యం మారుతూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో తలెత్తే పరిస్థితులకు అనుగణంగా.. పసిడి ధరలు మారుతూ ఉంటాయి. ఇక గత కొంత కాలంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పసిడి ధర 10 గ్రాముల రేటు 60 వేలకు పైగా చేరిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం వరకు బంగారం ధర భారీగా పెరగ్గా.. ప్రస్తుతం తగ్గుతూ వస్తోంది. గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా ఉండగా.. నేడు కూడా అదే దారిలో నడిచింది. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీలో బంగారం ధర ఎంత ఉంది అంటే..
నేడు హైదరాబాద్ బంగారు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర రూ.55,850 కి చేరింది. అలానే 10 గ్రాముల 24 క్యారెట్ మేలిమి బంగారం ధర రూ.60,930 గా ఉంది. ఇక ఢిల్లీలో నేడు 22 క్యారెట్ బంగారం ధర రూ. 56,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ 61,080 గా నమోదైంది. ఇక వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,400 గా ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,200 పలుకుతోంది.
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా.. బంగారం ధరలు మారుతుంటాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.