ప్రముఖ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్‌తో పాటు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొంది. అయితే కేవలం 2015-2023 పాస్ ఔట్ వారికి మాత్రమే అర్హులని పేర్కొంది. దేశవ్యాప్తంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, కోయంబత్తూర్, పుణె, చెన్నై, గుర్గావ్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఈ వెకెన్సీలు ఉన్నట్లు తెలిపింది. ఆఫ్ క్యాంపస్, వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
అర్హతలు…
దరఖాస్తు చేసుకునేవారు.. పదో తరగతి, ఇంటర్, డిప్లోమా, డిగ్రీ, పీజీ.. ఇలా పతి క్లాస్‌లో మినిమం అగ్రిగేట్ మార్కులు తెచ్చుకుని ఉండాలి.
క్వాలిఫికేషన్..
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు ఒకటి కంటే ఎక్కువ బ్యాక్లాగ్ ఉండరాదు. ఒక్క బ్యాక్ లాగ్ ఉన్నవారు కూడా అర్హులే.. కానీ కోర్సు వ్యవధి పూర్తయ్యలోపు దాన్ని క్లియర్ చేసుకోవాలి అని తెలిపింది.
గ్యాప్..
విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా గ్యాప్ వచ్చి ఉంటే దాన్ని తప్పకుండా తెలియజేయాలని.. ఈ గ్యాప్ కూడా 24 నెలలకు మించకూడదని సూచించింది. ఫుల్ టైమ్ కోర్సు పూర్తి చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులని పేర్కొంది. అయితే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒపెన్ స్కూలింగ్(NIOS) నుంచి సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా అర్హులని పేర్కొంది.
18-28 ఏళ్లలోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. రెండు సంవతర్సాల ఎక్స్పీరియన్స్ వాళ్లకి ప్రాధాన్యత అని పేర్కొంది.
అప్లికేషన్ ప్రాసెస్..
స్టెప్-1
TCS అని టైప్ చేయగానే విండో ఒపెన్ అవుతుంది. దానిలో TCS NextStep మీద క్లిక్ చేయాలి.
స్టెప్-2
రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి.
సీనారియో ఏ
మీరు ఇంతకు ముందే రిజస్టర్ అయి ఉంటే లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సబ్మిట్ అయ్యాక అప్లై ఫర్ డ్రైవ్(Apply For Drive) మీద క్లిక్ చేయాలి.
సీనారియో బీ
న్యూ యూజర్ అయితే రిజస్టర్ నౌ(Register Now) మీద క్లిక్ చేసి.. ఐటీ కేటగిరీ సెలక్ట్ చేసుకుని.. మీ వివరాలు ఫిల్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేశాకా.. అప్లై ఫర్ డ్రైవ్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్-3
తర్వాత మోడ్ ఆఫ్ టెస్ట్ అంటే రిమోట్, ఇన్ సెంటర్ విధానంలో ఏదో ఒకదాన్ని సెలక్ట్ చేసుకుని.. అప్లై బటక్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి టెస్ట్ మోడ్ సెలక్ట్ చేసుకుంటే.. మళ్లీ మార్చుకోవడానికి అవకాశం లేదు.
స్టేప్-4
స్టేటస్ కన్ఫామ్ చేసుకోవడానికి ట్రాక్ యువర్ అప్లికేషన్ని చెక్ చేయండి. స్టేటస్‌లో అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని ఉంటుంది.
అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.